పీఆర్సీ, ఈహెచ్‌ఎస్ మార్గదర్శకాలు ప్రకటించాలి
ABN , Publish Date - May 26 , 2026 | 05:31 AM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి ఉద్యోగ, పెన్షనర్ల పీఆర్సీని ప్రకటించాలని, అలాగే ఈహెచ్‌ఎ్‌స పూర్తి..
తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి ఉద్యోగ, పెన్షనర్ల పీఆర్సీని ప్రకటించాలని, అలాగే ఈహెచ్‌ఎస్ పూర్తి సమాచారంతో కూడిన ఆరోగ్య కార్డులను విడుదల చేయాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని సంఘ కేంద్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆరోగ్య కార్డులు, పీఆర్సీకి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించి, పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై పెన్షనర్లలో అవగాహన లోపించిందని సంఘం అభిప్రాయపడింది. ఈహెచ్‌ఎ్‌సకు సంబంధించిన మార్గదర్శకాలు, వ్యాధుల వివరాలు, ఆసుపత్రుల జాబితా ఇంకా పూర్తికాలేదని, ప్రభుత్వం వెంటనే వీటికి తుదిరూపం ఇచ్చి జూన్ 2న పూర్తి సమాచారంతో హెల్త్ కార్డులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. జూన్ 2న పీఆర్సీని ప్రకటించాలని కోరింది.