Share News

విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయండి

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:08 AM

తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ సొసైటీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల హక్కులను...

విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయండి

  • టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ డిమాండ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ సొసైటీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల హక్కులను... ప్రభుత్వం కాలరాస్తోందని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌ యూనియన్‌ (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ) ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది జులై నుంచి రిటైర్‌ అయిన 121 మంది ఉద్యోగులకు అందాల్సిన రూ.5.75 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఛైర్మన్‌ రామలక్ష్మణ్‌, అధ్యక్షుడు బాలస్వామి, ప్రధాన కార్యదర్శి కీర్తి రవి తెలిపారు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని వాపోయారు.

Updated Date - Apr 23 , 2026 | 05:08 AM