Share News

జలాశయాలు వెలవెల!

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:07 AM

కృష్ణా, గోదావరి బేసిన్లలోని జలాశయాల్లో తరిగిన నీటి నిల్వలు కలవరపెడుతున్నాయి. గత ఏడాది ఇదే రోజు (2025 మే 31)తో పోలిస్తే పలు రిజర్వాయర్లలో...

జలాశయాలు వెలవెల!

  • గత ఏడాదితో పోలిస్తే నిల్వలు తగ్గుముఖం

  • ఎల్‌నినో సంకేతాలతో గుబులు

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి బేసిన్లలోని జలాశయాల్లో తరిగిన నీటి నిల్వలు కలవరపెడుతున్నాయి. గత ఏడాది ఇదే రోజు (2025 మే 31)తో పోలిస్తే పలు రిజర్వాయర్లలో నిల్వలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతమే నమోదవుతుందన్న అంచనాలతో తాగు, సాగునీటికి కష్టాలు వెంటాడే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా లోటు బేసిన్‌ కృష్ణా కేంద్రంగా వివాదాలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. 105 టీఎంసీల సామర్థ్యం కలిగిన తుంగభద్ర జలాశయంలో గత ఏడాది ఇదే రోజున 18.86 టీఎంసీల నిల్వ ఉండగా మంగళవారం కేవలం 10.04 టీఎంసీలే ఉంది. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్‌లో గత ఏడాది ఇదే రోజున 51.86 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 39.36 టీఎంసీలు మాత్రమే ఉంది.

Updated Date - Jun 03 , 2026 | 06:07 AM