రెరా చైర్మన్ రాజీనామా
ABN , Publish Date - May 20 , 2026 | 03:47 AM
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ (టీజీ రెరా) చైర్మన్ ఎన్ సత్యనారాయణ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని ....
స్వచ్ఛందంగా వైదొలిగేందుకు గతంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి
తాజాగా సర్కారు అనుమతి
సత్యనారాయణ రాజీనామా
మూడేళ్ల పదవీకాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో పలు సంస్కరణలు
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ (టీజీ రెరా) చైర్మన్ ఎన్ సత్యనారాయణ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో మంగళవారం రాజీనామా చేశారు. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2023 జూన్‌లో టీజీ రెరా చైర్మన్‌గా సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పదవీకాలంలో ఆయన పలు సంస్కరణలు తీసుకొచ్చారు. పారదర్శకతకు, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. బిల్డర్లకు వారి బాధ్యతలను తెలియజేయడం, కొనుగోలుదారులకు భరోసా కల్పించటం తన విధుల్లో భాగమని పలు సందర్భాల్లో చెప్పారు. అనుమతి లేని వెంచర్లు, తప్పుడు ప్రకటనలపై కఠినంగా వ్యవహరించారు. రెరా రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేశారు. కొనుగోలుదారులు మోసపోకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేలా వ్యవస్థను బలోపేతం చేశారు. సత్యనారాయణ పదవి నుంచి తప్పుకోవడంతో, ఆయనతోపాటు రాజీనామా చేసేందుకు రెరాలో మరికొందరు సిద్ధపడుతున్నారు. ఈ పరిణామం రెరాలో చర్చనీయాంశంగా మారింది.