174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెరిట్ జాబితా
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:30 AM
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం విడుదల చేసింది.
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం విడుదల చేసింది. గైనకాలజీలో 90, అనస్థీషియాలో44, పీడియాట్రిక్స్‌లో 28, ఆర్థోపెడిక్స్‌లో 12 పోస్టులున్నాయి. ఈ జాబితాలో పేరున్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అనంతరం.. తుది జాబితా విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 1న హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 9న స్టాఫ్ నర్సింగ్ పోస్టుల తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపింది. మొత్తం 2,312 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.