Share News

బోధనాస్పత్రుల్లో 433 మంది స్పెషాలిటీ వైద్యులు

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:17 AM

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను తీర్చడంతో పాటు వైద్యవిద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామక...

బోధనాస్పత్రుల్లో 433 మంది స్పెషాలిటీ వైద్యులు

  • తుది జాబితా విడుదల చేసిన మెడికల్‌ బోర్డు

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను తీర్చడంతో పాటు వైద్యవిద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో 30 స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లోని 433 పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పూర్తిచేసింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, స్పీచ్‌ పాథాలజిస్టుల తుది జాబితాను బోర్డు బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపికైన వైద్యులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే వారికి నియామక పత్రాలను అందజేస్తామని వెల్లడించారు.

Updated Date - Jun 11 , 2026 | 04:17 AM