Share News

రైతుల ఖాతాల్లోకి రెండో విడత రైతుభరోసా

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:10 AM

రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సంబంధించి రెండో విడత రైతుభరోసా నిధులను ప్రభుత్వం మంగళవారం రైతుల ఖాతాల్లో జమచేసింది.

రైతుల ఖాతాల్లోకి రెండో విడత రైతుభరోసా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సంబంధించి రెండో విడత రైతుభరోసా నిధులను ప్రభుత్వం మంగళవారం రైతుల ఖాతాల్లో జమచేసింది. 45,11,947 మంది రైతులకు రూ.2,206 కోట్ల నిధులు (ఒక ఎకరం నుంచి రెండెకరాల వరకు) నేరుగా జమ అయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఈ నిధులను విడుదల చేశారు. మొదటి విడత నిధులతో కలిపి మొత్తం రూ.5,653 కోట్లు రైతాంగానికి అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - Apr 22 , 2026 | 04:10 AM