Share News

రిటైర్డు ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్‌కు రూ.2000 కోట్లు విడుదల

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:34 AM

రిటైర్డు ఉద్యోగులు, జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల క్లియరెన్స్‌కు ప్రభుత్వం సోమవారం రూ.2,000 కోట్లను విడుదల చేసింది..

రిటైర్డు ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్‌కు రూ.2000 కోట్లు విడుదల

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రిటైర్డు ఉద్యోగులు, జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల క్లియరెన్స్‌కు ప్రభుత్వం సోమవారం రూ.2,000 కోట్లను విడుదల చేసింది. రిటైర్డు ఉద్యోగుల పెండింగ్‌ బకాయిల కోసం 100 రోజుల్లో రూ.6000 కోట్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. గత నెల 29న రూ.2000 కోట్లను విడుదల చేయగా, ప్రస్తుతం మరో రూ.2 వేల కోట్లను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థికశాఖ అధికారులు ఈ నిధులను విడుదల చేశారు. రిటైర్డు ఉద్యోగులకు సంబంధించి 2025, సెప్టెంబరు వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్‌ బకాయిలు, రూ.10 వేల లోపు ఉన్న ఇతర చిన్న బిల్లులు, జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయుల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎ్‌ఫ)కు సంబంధించిన బకాయిలు ఈ నిధులతో క్లియర్‌ కానున్నాయి.

Updated Date - Jun 30 , 2026 | 04:34 AM