ఈ నెల 26 నుంచి 28 వరకు రిజిస్ర్టేషన్ సేవలు బంద్
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:04 AM
స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖలో తరచూ తలెత్తుతున్న సర్వర్ సమస్యలను పరిష్కరించేందుకు రిజిస్ర్టేషన్ శాఖ సిద్ధమైంది. సర్వర్ నిర్వహణ ...
హైదరాబాద్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖలో తరచూ తలెత్తుతున్న సర్వర్ సమస్యలను పరిష్కరించేందుకు రిజిస్ర్టేషన్ శాఖ సిద్ధమైంది. సర్వర్ నిర్వహణ వల్ల రిజిస్ర్టేషన్ శాఖ వెబ్‌సైట్‌తోపాటు ఇతర ఆన్‌లైన్ సేవలు ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సుమారు ఐదేళ్ల తర్వాత సర్వర్ నిర్వహణ పనులు చేపడుతున్నామని, ఇకపై సేవల నాణ్యత, భద్రతా ప్రమాణాలు మరింత మెరుగవుతాయన్నారు. జూన్ 26న మొహరం, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవులు ఉన్నందున.. జూన్ 27న ఒక్క రోజు మాత్రం రిజిస్ర్టేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు రిజిస్ర్టేషన్ పనుల కోసం ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29 నుంచి అన్ని సేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయన్నారు.