Share News

రిజిస్ర్టేషన్‌ శాఖకు రూ.15,262 కోట్ల ఆదాయం

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:52 AM

రాష్ట్ర రిజిస్ర్టేషన్‌ శాఖ ఖజానాకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.15,262.27 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి..

రిజిస్ర్టేషన్‌ శాఖకు రూ.15,262 కోట్ల ఆదాయం

రాష్ట్ర రిజిస్ర్టేషన్‌ శాఖ ఖజానాకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.15,262.27 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం వచ్చిన రూ. 14,214తో పోలిస్తే ఇది 7.46(రూ.1048కోట్లు) శాతం అదనం. ఈసారి రిజిస్ట్రేషన్లు అయిన డాక్యుమెంట్ల సంఖ్య తగ్గినా ఆదాయ పెరగడం గమనార్హం. గతేడాది 17.45లక్షల డాక్యుమెంట్లు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 17.15లక్షలకు పరిమితమైంది. రూ.కోటి నుంచి రూ.5 కోట్ల లోపు విలువజేసే ఫ్లాట్లు, విల్లాల కొనుగోళ్లు పెరగడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. 2026-27లో రిజిస్ర్టేషన్‌ శాఖకు రూ.19 వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ఆర్థిక శాఖ నిర్దేశించింది. రాష్ట్రంలోని పురపాలక శాఖ పన్ను వసూళ్లలోనూ పురోగతి వచ్చిందని ఆ శాఖ సంచాలకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25లో రూ.617.38 కోట్ల పన్ను వసూళ్లు కాగా, 2025-26లో ఆ మొత్తం రూ.685.04 కోట్లకు చేరింది. గద్వాల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో గత ఏడాది 74.91 శాతం పన్ను వసూలు చేయగా, ఈ ఏడాది ఏకంగా 91.23 శాతానికి చేరుకుంది. గతేడాదితో పోల్చితే 64 మునిసిపాలిటీల్లో పన్ను వసూళ్లు పెరిగాయి. ఇక, హుజూరాబాద్‌, జమ్మికుంట 100 శాతం పన్ను వసూలు చేశాయని తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 02:52 AM