రిజిస్ట్రేషన్లకు రద్దీ లేకుండా ఏర్పాట్లు
ABN , Publish Date - May 28 , 2026 | 03:28 AM
రిజిస్ట్రేషన్ శాఖ భూముల మార్కెట్ విలువలను పెంచనున్న నేపథ్యంలో.. రిజిస్ట్రేషన్ల రద్దీని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రెవెన్యూ..
మే 29 నుంచి జూన్ 3 వరకు అదనపు పని వేళలు
అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, మే 27 (ఆంధ్ర జ్యోతి) : రిజిస్ట్రేషన్ శాఖ భూముల మార్కెట్ విలువలను పెంచనున్న నేపథ్యంలో.. రిజిస్ట్రేషన్ల రద్దీని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మే 29 నుంచి జూన్ 3వ తేదీ వరకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు పని వేళలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తారని, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు వేచి ఉండే అవసరం లేకుండా ఏర్పాట్లు చేయాలని బుధవారం ఆ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతును ఆదేశించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బుకింగ్ స్లాట్ల సంఖ్య పెంచాలని అధికారులకు సూచించారు. రద్దీ ఎక్కువగా ఉంటే మరికొన్ని రోజులు అదనపు పనివేళలు పొడగిస్తామన్నారు.