Share News

200 గజాల స్థలం ఉంటే ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రం

ABN , Publish Date - Apr 25 , 2026 | 07:02 AM

పీఎం ఈ-డ్రైవ్‌ కింద జాతీయ, రాష్ట్ర హైవేలపై ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలు పెట్టుకోవడానికి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల...

200 గజాల స్థలం ఉంటే ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రం

  • పీఎం ఈ-డ్రైవ్‌ కింద 80 శాతం సబ్సిడీ

  • దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రెడ్‌కో విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పీఎం ఈ-డ్రైవ్‌ కింద జాతీయ, రాష్ట్ర హైవేలపై ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలు పెట్టుకోవడానికి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(తెలంగాణ రెడ్‌కో) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి గల భూముల యజమానులు, వాణిజ్య సంస్థలు ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలు పెట్టుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని రెడ్‌కో కోరింది. హైదరాబాద్‌తో పాటు గ్రేటర్‌ వరంగల్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి, కరీంనగర్‌, నల్గొండ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై కనీసం 200 గజాల స్థలాలు కలిగిన వారు మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేసింది. మరిన్ని వివరాలకు, దరఖాస్తులను సమర్పించడానికి WWW.tgredco.telangana.gov.in/EMobility/PMEDrive లో లేదా 63049 03957, 63049 03935 నెంబర్లలో సంప్రదించాలని సూచించింది. ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రానికి అయ్యే వ్యయంలో 80 శాతం సబ్సిడీగా పొందే అవకాశం ఉంటుందని గుర్తుచేసింది.

Updated Date - Apr 25 , 2026 | 07:04 AM