Share News

పవన విద్యుత్‌లో తెలంగాణకు జాతీయ అవార్డు

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:48 AM

ప్రపంచ పవన దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన, పునరుద్ధరణ ఇంధన శాఖ (ఎమ్‌ఎన్‌ఆర్‌ఈ) నిర్వహించిన జాతీయ సదస్సులో తెలంగాణకు ...

పవన విద్యుత్‌లో తెలంగాణకు జాతీయ అవార్డు

ప్రపంచ పవన దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన, పునరుద్ధరణ ఇంధన శాఖ (ఎమ్‌ఎన్‌ఆర్‌ఈ) నిర్వహించిన జాతీయ సదస్సులో తెలంగాణకు ‘ఇంక్లూజివ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అండ్‌ ఎకో సిస్టమ్‌ డెవల్‌పమెంట్‌’ అవార్డు లభించింది. పవన విద్యుత్‌ రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకానికి గానూ రాష్ట్రం ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. గోవాలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చేతుల మీదుగా తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్‌, రెడ్‌కో వీసీఎండీ వి.అనిల ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రంలో పవన విద్యుత్‌ ఉత్పాదనకు భారీ అవకాశాలు ఉన్నాయని జాతీయ పవన విద్యుత్‌ సంస్థ ఇప్పటికే ఒక నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటికే 128.8 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్‌ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Jun 16 , 2026 | 04:48 AM