Share News

మార్కెట్‌ విలువల పెంపు..నెమ్మదించిన కొనుగోళ్లు

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:54 AM

ఈ నెల 5 నుంచి సవరించిన భూముల మార్కెట్‌ విలువలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి భూములు, ఫ్లాట్లు, వాణిజ్య ఆస్తుల మార్కెట్‌ విలువలు పెంచింది.

మార్కెట్‌ విలువల పెంపు..నెమ్మదించిన కొనుగోళ్లు

హైదరాబాద్‌, జూన్‌ 11(ఆంధ్ర జ్యోతి): ఈ నెల 5 నుంచి సవరించిన భూముల మార్కెట్‌ విలువలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి భూములు, ఫ్లాట్లు, వాణిజ్య ఆస్తుల మార్కెట్‌ విలువలు పెంచింది. అయితే గత ఐదు రోజులుగా జరిగిన లావాదేవీలు పరిశీలిస్తే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తాత్కాలిక స్తబ్ధత నెలకొన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌ విలువల పెంపుతో స్టాంపు డ్యూటీ, రిజిస్ర్టేషన్‌ ఫీజులు పెరిగాయి. దీంతో కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారు కొంత కాలం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు మార్కెట్‌ విలువల సవరణ అనంతరం ప్రమోటర్లు, విక్రేతలు ధరల విషయంలో రాజీపడకపోవడం వల్ల కూడా లావాదేవీలు తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. విలువల పెంపునకు ముందే ఎక్కువ మంది వినియోగదారులు లావాదేవీలు పూర్తి చేసుకున్నట్లు కూడా భావిస్తున్నారు.

Updated Date - Jun 12 , 2026 | 05:54 AM