ఆర్ అండ్ బీలో రోడ్స్ ఈఎన్సీ ఎవరు.?
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:27 AM
రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖలో స్టేట్ రోడ్స్ ఇంజినీర్ ఇన్ చీఫ్ పోస్టులో ఉన్న మోహన్ నాయక్ ఏసీబీకి దొరికిపోవడంతో పోస్టు ఖాళీ అయింది.
మోహన్ నాయక్ ఏసీబీకి దొరికిపోవడంతో పోస్టులు ఖాళీ
ఐఆర్‌సీకి కొత్త సారథి నియామకం.!
హైదరాబాద్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖలో స్టేట్ రోడ్స్ ఇంజినీర్ ఇన్ చీఫ్ పోస్టులో ఉన్న మోహన్ నాయక్ ఏసీబీకి దొరికిపోవడంతో పోస్టు ఖాళీ అయింది. రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఆర్‌డీసీ)కు ఎండీగా కూడా నాయక్ వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ 2 పోస్టుల్లోకి ఎవరు రానున్నారనేది చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారిపై సస్పెన్షన్ ఆర్డర్ ఇంకా రాలేదని, అదే సమయంలో కొత్త బాధ్యతలు కూడా ఎవరికీ ఇవ్వలేదని శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఆర్ అండ్ బీ రీ-ఆర్గనైజేషన్‌లో మంజూరైన దాని ప్రకారం స్టేట్ రోడ్స్ విభాగానికి చీఫ్ ఇంజినీర్ పోస్టు మాత్రమే ఉంది. మోహన్ నాయక్ శాఖలో సీనియర్‌గా ఉండడంతో ఆయనకు ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)గా పదోన్నతి కల్పించి, స్టేట్ రోడ్స్ ఈఎన్సీగా బాధ్యతలు ఇచ్చారు. వాస్తవానికి ఈ పోస్టులో సీఈ ఉంటారు. ప్రస్తుతం మోహన్ రిమాండ్‌లో ఉండడంతో సీఈ హోదాలో ఉన్నవారితోనే పోస్టును భర్తీ చేయాల్సి ఉందని శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.