వినియోగదారుల వివాద పరిష్కార ర్యాంకుల్లో తెలంగాణకు చివరిస్థానం: ఐజేఆర్
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:07 AM
పెద్ద రాష్ట్రాల్లో వినియోగదారుల వివాద పరిష్కార వ్యవస్థ పనితీరులో తెలంగాణ చివరి స్థానంలో ఉందని ఇండియా జస్టిస్ పోర్ట్ ...
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): పెద్ద రాష్ట్రాల్లో వినియోగదారుల వివాద పరిష్కార వ్యవస్థ పనితీరులో తెలంగాణ చివరి స్థానంలో ఉందని ఇండియా జస్టిస్ పోర్ట్ (ఐజెఆర్) వినియోగదారుల న్యాయ నివేదిక-2026 పేర్కొంది.. దేశంలో మొట్టమొదటిసారిగా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ల పనితీరు, సామర్థ్యాలకు సంబంధించి 19 పెద్ద, మధ్య తరహా (కోటి కంటే ఎక్కువ జనాభాతో) రాష్ట్రాల్లో పరిశీలన జరిపి నివేదిక రూపొందించారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర కమిషన్‌లో కేసును పరిష్కరించడానికి దాదాపు వెయ్యి రోజులు పడుతోంది.. ఇది నిర్దేశించిన సమయం కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ. దీంతో తెలంగాణ ర్యాంకు గణనీయంగా పడిపోయి చిట్టచివరిస్థానంలో నిలిచింది.