ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో రాష్ట్రం
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:22 AM
రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్లు కేంద్రం వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి..
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్లు కేంద్రం వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ఆ వివరాల ప్రకారం.. 2018-19లో రాష్ట్రంలో 92.75 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగగా, 2023-24లో 198.37 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. 2023-24లో 592.91 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో యూపీ మొదటిస్థానంలో నిలిచింది. 398.43 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మధ్యప్రదేశ్ రెండోస్థానంలో, 325.86 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో పంజాబ్ మూడోస్థానంలో, 200.43 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో బిహార్ నాలుగో స్థానంలో నిలిచింది.