స్వీయ పన్నుల రాబడిలో ఆరో స్థానంలో తెలంగాణ
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:23 AM
స్వీయ పన్నుల రాబడిలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను మదింపు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...
వరుసగా మూడేళ్ల పాటు అదేస్థానం... వివరాలు వెల్లడించిన ఆర్‌బీఐ
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): స్వీయ పన్నుల రాబడిలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను మదింపు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... 2023-24, 2024-25, 2025-26 సంవత్సరాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల స్వీయ పన్నుల రాబడి వివరాలను వెల్లడించింది. 2023-24 వాస్తవ లెక్కల ప్రకారం... మహారాష్ట్ర 15.5 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్(9.9ు), తమిళనాడు(8.6ు), కర్నాటక(8.4ు), గుజరాత్(6.9ు) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. 5.7 శాతం స్వీయ పన్నుల రాబడితో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం కూడా 5.8 శాతం సొంత పన్నుల రాబడితో రాష్ట్రం ఆరో స్థానంలోనే నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణ 5.7తో అదే ఆరో స్థానంలో ఉంది.