Share News

నంబర్‌ వన్‌గా తెలంగాణ ఆడిటింగ్‌ విధానం

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:15 AM

ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిటింగ్‌ విభాగం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

నంబర్‌ వన్‌గా తెలంగాణ ఆడిటింగ్‌ విధానం

  • గుజరాత్‌ అధికారుల బృందంతో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిటింగ్‌ విభాగం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వరుసగా మూడుసార్లు రాష్ట్రం ఈ ర్యాంకును సాధించిందని తెలిపారు. ఈ విధానాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన గుజరాత్‌ ఆడిట్‌శాఖ ఉన్నతాధికారుల బృందం మంగళవారం సచివాలయంలో డిప్యూటీ సీఎంతో భేటీ అయింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడిటింగ్‌ విభాగంతో పాటు అన్ని వ్యవస్థలు అత్యంతబలంగా ఉన్నాయని గుజరాత్‌ బృందానికి వివరించారు. కాగా రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలను రెండు రోజులుగా సందర్శిస్తున్నామని.. ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని గుజరాత్‌ బృందం తెలిపింది. తెలంగాణ ఆడిటింగ్‌ విధానం పారదర్శకంగా, సమర్థంగా కొనసాగుతోందని అభినందించింది.

Updated Date - Apr 08 , 2026 | 06:15 AM