Share News

రైతు డిస్కమ్‌కు నెలాఖరులో లైసెన్స్‌!

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:53 AM

తెలంగాణ రైతు డిస్కమ్‌కు ఈ నెలాఖరులో లైసెన్స్‌ జారీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ సంస్థ పెట్టుకున్న పిటిషన్‌పై టీజీఈఆర్‌సీ ..

రైతు డిస్కమ్‌కు నెలాఖరులో లైసెన్స్‌!

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతు డిస్కమ్‌కు ఈ నెలాఖరులో లైసెన్స్‌ జారీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ సంస్థ పెట్టుకున్న పిటిషన్‌పై టీజీఈఆర్‌సీ నిర్వహించిన బహిరంగ విచారణలో భారీగా అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. అయితే వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ, వాటర్‌బోర్డు, మున్సిపల్‌ వాటర్‌ కనెక్షన్ల నుంచి తప్పుకొంటున్నట్లు ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు దాఖలు చేసిన సవరణ లైసెన్స్‌ పిటిషన్లపై ఈనెల 22వ తేదీ వరకు అభ్యంతరాలకు ఈఆర్‌సీ అవకాశం ఇచ్చింది. వాటికి సవరణ లైసెన్స్‌ను జారీ చేసిన తర్వాత రైతు డిస్కమ్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు రైతు డిస్కమ్‌ పిటిషన్‌పై అధ్యయనం కోసం ఈఆర్‌సీ కొంత గడువు కోరే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈమేరకుకు ‘డీమ్డ్‌ టూ లైసెన్స్‌’ జారీచేసేఅవకాశాలున్నట్లు తె లుస్తోంది.

Updated Date - Jun 11 , 2026 | 04:53 AM