Share News

కృష్ణా జలాలను ఇతర బేసిన్‌లకు మళ్లించొద్దు

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:19 AM

కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం ఇతర బేసిన్‌లకు తరలించడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. బచావత్‌(కృష్ణా-1), బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌(కృష్ణా-2) ప్రకారం బేసిన్‌ అవసరాలు తీరిన తర్వాతే ఇతర బేసిన్‌లకు నీటిని ....

కృష్ణా జలాలను ఇతర బేసిన్‌లకు మళ్లించొద్దు

  • అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి

  • ఏపీ ఫిర్యాదులపైనే కాదు..మా విజ్ఞప్తులపైనా స్పందించండి

  • కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం ఇతర బేసిన్‌లకు తరలించడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. బచావత్‌(కృష్ణా-1), బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌(కృష్ణా-2) ప్రకారం బేసిన్‌ అవసరాలు తీరిన తర్వాతే ఇతర బేసిన్‌లకు నీటిని మళ్లించాలని ఉందని గుర్తు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను తరలించడానికి వీలుగా రూ.47,776.50 కోట్లతో పనులకు పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చిందని పేర్కొంది. ఈ ప్రక్రియ తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) రమేశ్‌ బాబు లేఖ రాశారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం కృష్ణా బేసిన్‌లో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా, విధి గా ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణాబోర్డు మదిం పు వేయాల్సి ఉందని తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరిఅని గుర్తు చేశారు. అయితే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను మరింత తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని ఆక్షేపించారు. హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స), గాలే రు నగరి సుజల స్రవంతి(జీఎన్‌హెచ్‌ఎ్‌స), తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచి, అదనంగా 114.75 టీఎంసీలు తరలించాలని ఏపీ చూస్తుందన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే మరో 10 ప్రాజెక్టుల ద్వారా వరికపుడిశాల, నాగార్జునసాగర్‌ కుడి కాలువ విస్తరణతో గుంటూరు చానల్‌, తుంగభద్ర హైలెవల్‌ కెనాల్‌కు సమాంతరంగా మరో కెనాల్‌, శ్రీశైలం రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌ విస్తరణ, గుండ్లకమ్మ వంటి ప్రాజెక్టులతో 176.457 టీఎంసీలు మళ్లింపచడానికి ప్రణాళికను సిద్ధం చేసిందని వివరించారు. ఏపీ చేస్తున్న ఉల్లంఘనలపై తాము 2021 నుంచి అనేక లేఖలు, ఫిర్యాదులు చేస్తున్న బోర్డు స్పందించడం లేదని, అదే సమయంలో తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ చేసిన ఫిర్యాదులపై బోర్డు సత్వర స్పందన ఉంటుందని ఆక్షేపించారు. తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులు కొత్తవి కావని, ఇవి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించిన ప్రాజెక్టులని తెలిపారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ఫిర్యాదులపై స్పందించడం మానుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Feb 28 , 2026 | 04:19 AM