నేటి నుంచి 10 రోజుల పాటు వర్షాలు
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:19 AM
తెలంగాణలో జూన్ 4 నుంచి 14 తేదీల మధ్య వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ పది రోజుల వ్యవధిలో ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నేడు కేరళకు నైరుతి
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జూన్ 4 నుంచి 14 తేదీల మధ్య వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ పది రోజుల వ్యవధిలో ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 39-41 డిగ్రీల మధ్య, హైదరాబాద్‌లో 36-38 డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించారు. అలాగే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపారు. ఇక రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో 50-60 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కు రిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడుల్లోకి గురువారం ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలం గా ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లా ఏన్కూరులో అత్యధికంగా 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.