వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:21 AM
రాష్ట్రంలో ప్రస్తుత వర్షాకాలంలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ రోడ్డు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఆర్ అండ్ బీ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
హైదరాబాద్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుత వర్షాకాలంలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ రోడ్డు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వరదల వల్ల రహదారులు, వంతెనలు, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలకు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ను విడుదల చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. జూన్ నుంచి అక్టోబరు వరకు సూపరింటెండెంట్ ఇంజనీర్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.