Share News

Deputy CM Batti Vikramarka: పేదలకు ఆసరాగా గృహజ్యోతి

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:47 AM

రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని, దీనివల్ల 52,82,498 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు....

Deputy CM Batti Vikramarka: పేదలకు ఆసరాగా గృహజ్యోతి

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని, దీనివల్ల 52,82,498 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం పేదలకు ఆసరాగా నిలుస్తోందని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో సుమారు 50ు కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడైనా అర్హులు ఉండి పథకం వినియోగానికి నోచుకోకపోతే.. ప్రజాపాలన అధికారులకు వినతి పత్రం ఇస్తే వారు సమస్య పరిష్కరిస్తారని ఆయన తెలిపారు.

Updated Date - Jan 04 , 2026 | 04:47 AM