Share News

ప్రపంచ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా..రాష్ట్ర యువతను సిద్ధం చేస్తున్నాం: మంత్రి వివేక్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:17 AM

ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర యువతను సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి తెలిపారు.

ప్రపంచ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా..రాష్ట్ర యువతను సిద్ధం చేస్తున్నాం: మంత్రి వివేక్‌

  • మంత్రితో జపాన్‌లోని హిరోషిమా రాష్ట్ర బృందం భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర యువతను సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. జపాన్‌లోని హిరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రి వివేక్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ... రాష్ట్ర యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వారి ఉపాధి సామర్థ్యాలను పెంపొందించడంలో టామ్‌కామ్‌ అత్యంత వృత్తిపరమైన కృషి చేస్తోందని తెలిపారు. వివిధ పరిశ్రమలు, ఆయా రంగాల్లో భారత యువతకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల గురించి జపాన్‌ ప్రతినిధులు మంత్రికి వివరించారు. తెలంగాణ, హిరోషిమా మధ్య ఉపాధి అవకాశాలను మరింత విస్తరించుకోవడంపై సంయుక్త కార్యాచరణ బృందం(జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌)ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అనంతరం హిరోషిమా బృందం రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలను సందర్శించింది.

Updated Date - Jun 06 , 2026 | 04:17 AM