Share News

మండల స్థాయిలో ‘ప్రజావాణి’

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:29 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇక నుంచి మండల స్థాయిలోనూ నిర్వహించనున్నారు.

మండల స్థాయిలో ‘ప్రజావాణి’

  • సీఎస్‌ సంజయ్‌ జాజు ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇక నుంచి మండల స్థాయిలోనూ నిర్వహించనున్నారు. ప్రతి సోమవావారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్‌ కార్యాలయాల్లో(ఎంపీడీఓ) ఈ కార్యక్రమాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపింది. 23 శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించాలని, వాటిని ప్రజావాణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 05:30 AM