పాలిటెక్నిక్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్!
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:09 AM
డిప్లొమా పూర్తవగానే వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించే విధంగా.. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా, ....
ఏఐసీటీఈ అనుమతితో దేశంలోనే తొలిసారిగా ఐదు కొత్త కోర్సులు అందుబాటులోకి
కొత్త కోర్సుల చేరికతో ఈ ఏడాది 5వేల సీట్లు పెంపు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): డిప్లొమా పూర్తవగానే వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించే విధంగా.. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి(ఎ్‌సబీటీఈటీ) ప్రకటించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన అధునాతన కోర్సులను 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. ఎస్‌బీటీఈటీ కార్యదర్శి పుల్లయ్య ఈ వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ రూపొందించిన 5 కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐఈసీటీ) నుంచి అనుమతులు లభించాయని తెలిపారు. కొత్త కోర్సులు, సిలబస్ రూపకల్పన, విద్యార్థులకు ఇంటర్న్‌షి్‌పలు, ఫ్యాకల్టీకి శిక్షణ కోసం ఐఐటీ హైదరాబాద్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) వంటి సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. కొన్ని పాత కోర్సులకు కొత్త సబ్జెక్టులను జోడించి, వాటి పేర్లను మార్చామని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 13,050 సీట్లు ఉండగా.. కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులకు సంబంధించిన 5వేలకుపైగా సీట్లు కలిపి మొత్తం 18,330 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కొత్త డిప్లొమా కోర్సులు ఇవే..
డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్, ల్యాండ్ స్కేప్ డిజైన్, మల్టీమీడియా అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్.