Share News

రేపటి నుంచి పాలిటెక్నిక్‌ తొలి విడత కౌన్సెలింగ్‌

ABN , Publish Date - May 26 , 2026 | 04:41 AM

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో మొత్తం 33,140 సీట్లు ఉన్నట్లు సాంకేతిక విద్యా కమిషనర్‌ ఎ.శ్రీదేవసేన పేర్కొన్నారు.

రేపటి నుంచి పాలిటెక్నిక్‌ తొలి విడత కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ సిటీ, మే25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో మొత్తం 33,140 సీట్లు ఉన్నట్లు సాంకేతిక విద్యా కమిషనర్‌ ఎ.శ్రీదేవసేన పేర్కొన్నారు. ఇటీవల పాలిసెట్‌ ఫలితాలు విడుదల కాగా, 27 నుంచి తొలివిడత అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తునట్లు ఆమె వెల్లడించారు. పాలిసెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులు ఈ నెల 27 నుంచి 31 వరకు తమ వివరాలు నమోదుతోపాటు హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. 29 నుంచి జూన్‌ 1వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 6వతేదీలోగా తొలివిడత కేటాయింపులు ఉంటాయి.

Updated Date - May 26 , 2026 | 04:41 AM