27 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
ABN , Publish Date - May 19 , 2026 | 04:30 AM
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యామండలి విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది.
షెడ్యూల్ విడుదల చేసిన సాంకేతిక విద్యామండలి
హైదరాబాద్ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యామండలి విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన అభ్యర్థులు 29 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్లు స్వీకరించి, జూన్ 6న తొలివిడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు షెడ్యూలులో విద్యామండలి పేర్కొంది. తర్వాత జూన్ 10 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మిగిలిన సీట్ల భర్తీకి జూలై 1 నుంచి 8 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. కాగా, పాలిసెట్ ఫలితాలు 23 లేదా 24 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది.