Share News

5వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:21 AM

తెలంగాణ పోలీసుశాఖలో త్వరలో భారీ స్ధాయిలో 5వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో డీజీపీ సి.వి.ఆనంద్‌ గురువారం హైదరాబాద్‌లోని రాజా బహదూర్‌ ....

5వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

  • పోలీసు అకాడమీని సందర్శించిన డీజీపీ ఆనంద్‌

హైదరాబాద్‌, జూన్‌4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసుశాఖలో త్వరలో భారీ స్ధాయిలో 5వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో డీజీపీ సి.వి.ఆనంద్‌ గురువారం హైదరాబాద్‌లోని రాజా బహదూర్‌ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీని సందర్శించారు. అక్కడున్న సౌకర్యాలను పరిశీలించారు. పోలీసు శిక్షణలో అత్యుత్తుమ ఫలితాల సాధనే లక్ష్యమని చెప్పారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ అంశాలపై తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష్‌ బిస్త్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సమస్యలను వివరించారు. అన్ని ర్యాంకులకు చెందిన పోలీసు సిబ్బందికి తప్పనిసరిగా శిక్షణా తరగతులను నిర్వహించాలని డీజీపీ సూచించారు. పోలీస్‌ అధికారుల రిట్రీట్‌ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవంబర్‌ చివరి వారం లేదా డిసెంబర్‌ మొదటి వారంలో నిర్వహిస్తామని ప్రకటించారు. మహిళా సిబ్బందికి సంబంధించిన సంస్కరణలు, సమగ్ర భాగస్వామ్యం, సంస్థాగత మద్దతు వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి ‘తెలంగాణ కాన్ఫరెన్స్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ పోలీస్‌’ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని సూచించారు.

Updated Date - Jun 05 , 2026 | 04:21 AM