మన పాస్‌పోర్ట్ సేవలకు జాతీయ గుర్తింపు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:41 AM
పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధ్రువీకరణ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసు శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ...
తెలంగాణ పోలీసుకు ‘పెర్ఫార్మెన్స్’ అవార్డు
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధ్రువీకరణ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసు శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. 2025-26లో పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణలో విశిష్ట సేవలు అందించిన సంస్థగా తెలంగాణ పోలీసు శాఖను ఎంపిక చేస్తూ ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ చీఫ్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ బీఎస్ ముబారక్ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు అధికారిక లేఖ పంపారు. ఈ నెల 19న న్యూ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా డీజీపీ సీవీ ఆనంద్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు. అలాగే పాస్‌పోర్ట్ ేసవా దివ్‌సలో భాగంగా నిర్వహించే హై-లెవల్ సెగ్మెంట్ కార్యక్రమానికి డీజీపీ సీవీ ఆనంద్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఆహ్వానించింది.