పురపోరుకు పోలీసు పహారా
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:54 AM
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్
నిర్భయంగా ఓటు హక్కు
వినియోగించుకోండి: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే శాంతియుత వాతావరణం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వచ్చిందని, అక్రమ నగదు, మద్యం,ఉచితాల పంపిణీని అడ్డుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. రూ. 50 వేల కన్నా ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు చూపాలని చెప్పారు.
‘భద్రం నాన్న’ షార్ట్‌ఫిలిం పోస్టర్ అవిష్కరణ
రోడ్డు భద్రతపై సర్వేజన ఫౌండేషన్ రూపొందించిన ‘భద్రం నాన్న’ షార్ట్‌ఫిలిం పోస్టర్‌ను డీజీపీ శివధర్ రెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురవారెడ్డి, సీఈవో బి. జనార్ధన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. డీజీపీని కలిసి సురక్షిత డ్రైవింగ్ కోసం తాము చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను వివరించారు.