ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు పతకాలు
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:50 AM
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్‌రెడ్డి పతకాలు ప్రదానం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని..
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చేతుల మీదుగా ప్రదానం
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్‌రెడ్డి పతకాలు ప్రదానం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో నిర్వహించిన వేడుకల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 25 మంది పోలీసులకు మెరిటోరియస్ సేవా పతకం-2024, మెరిటోరియస్ సేవా పతకం-2025, మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం-2026 కింద పురస్కారాలు అందజేశారు. మెరిటోరియస్ సేవా పతకం-2024 అందుకున్నవారిలో.. అవినాష్ మొహంతి ఐపీఎస్ (డైరెక్టర్, ఏసీబీ), పి.కృష్ణమూర్తి (టీజీ ఈగల్ ఫోర్స్ అదనపు ఎస్పీ), సయ్యద్ జమీల్ బాషా (3వ టీజీఎ్‌సపీ కమాండెంట్), ఎన్.జ్ఞాన సుందరి (ఐటీ అండ్ సీ ఇన్‌స్పెక్టర్), ఇక్రం ఏబీ ఖాన్ (రిటైర్డ్ ఎస్‌ఐ), గుంటి వెంకటేశ్వర్లు (రిటైర్డ్ ఏఎస్ఐ), ఎ.లక్ష్మయ్య (రిటైర్డ్ ఏఎస్ఐ), అబ్దుల్ రఫీక్ (ఏఆర్‌ఎస్ఐ, మరణానంతరం), శ్రీనివాస మిశ్రా (రిటైర్డ్ ఏఆర్‌ఎస్ఐ), కొమరబత్తిని రాము (రిటైర్డ్ ఏఆర్‌ఎస్ఐ), కుంచాల బాలకాషయ్య (రిటైర్డ్ ఏఆర్‌ఎస్ఐ)లు ఉన్నారు. అదేవిధంగా మెరిటోరియస్ సేవా పథకం-2025ను కార్తికేయ ఐపీఎస్ (హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఐజీపీ), డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న కె.రామ్‌కుమార్, రిటైర్డ్ అదనపు డీ సీపీ మహ్మద్ ఫజ్లుర్ రహ్మాన్, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఎ.ముత్యం రెడ్డి, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ కె.వి.రమణ, సైబరాబాద్ కార్ హెడ్‌క్వార్టర్స్ ఏసీపీ ఎ.వేణుగోపాల్, కరీంనగర్ రూరల్ పోలీ్‌సస్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనుమాల నిరంజన్‌రెడ్డి, రిటైర్డ్ ఏఎ్‌సఐ రణవీర్ సింగ్ ఠాకూర్, రిటైర్డ్ ఏఆర్‌ఎ్‌సఐ పీటర్ జోసెఫ్ బహదూర్, ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఏఆర్‌ఎస్ఐ మహ్మద్ మొయినుల్లా ఖాన్, రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ వి.పాథ్యా నాయక్, రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ ఎం.అయూబ్ ఖాన్ అందుకున్నారు. ఇక సీఐ సెల్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్ గౌడ్‌కు గ్యాలంట్రీ మెడల్ లభించింది. టీజీజెన్‌కో, విద్యుత్ సౌధ, హైదరాబాద్‌లో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న డి.ప్రతా్‌పకు ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం దక్కింది.