631 మందికి పోలీసు పతకాలు
ABN , Publish Date - Jun 02 , 2026 | 04:28 AM
అత్యుత్తమ సేవలందించిన 631 మంది పోలీసులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పభుత్వం పతకాలు ప్రకటించింది.
జెన్‌కో విజిలెన్స్ చీఫ్ డి.ప్రతాప్‌కు ముఖ్యమంత్రి సర్వోన్నత పతకం
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): అత్యుత్తమ సేవలందించిన 631 మంది పోలీసులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పభుత్వం పతకాలు ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి శిఖా గోయల్ సోమవారం జీవో జారీ చేశారు. తెలంగాణ జెన్‌కోలో చీఫ్ ఆఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీగా పనిచేస్తున్న అదనపు ఎస్పీ డి. ప్రతాప్ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా శౌర్య పతకానికి 10 మంది, మహోన్నత పతకానికి 16, ఉత్తమ సేవా పతకానికి 94, కఠిన సేవా పతకానికి 50, సేవా పతకానికి 461 మంది ఎంపిక అయ్యారు. వీరినీ డీజీపీ ఆనంద్ అభినందించారు.