Share News

పోలీసు సిబ్బందికి కరదీపికలా హ్యాండ్‌ బుక్‌

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:47 AM

పోలీసు సిబ్బంది విధుల నిర్వహణ, సర్వీసు నిబంధనలపై స్పష్టతనిచ్చే బిజినెస్‌ రూల్స్‌ అండ్‌ జనరల్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ హ్యాండ్‌బుక్‌ను...

పోలీసు సిబ్బందికి కరదీపికలా హ్యాండ్‌ బుక్‌

  • ఆవిష్కరించిన డీజీపీ శివధర్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఏప్రిల్‌22(ఆంధ్రజ్యోతి): పోలీసు సిబ్బంది విధుల నిర్వహణ, సర్వీసు నిబంధనలపై స్పష్టతనిచ్చే బిజినెస్‌ రూల్స్‌ అండ్‌ జనరల్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ హ్యాండ్‌బుక్‌ను... డీజీపీ శివధర్‌రెడ్డి బుధవారం తన కార్యాలయంలోని ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇది పోలీసు సిబ్బందికి, అధికారులకు కరదీపికలా ఉంటుందన్నారు. వారి సర్వీసు వ్యవహారాల ఫైళ్లను పరిశీలించే క్రమంలో పాటించాల్సిన విధి విధానాలను పొందుపరిచినట్లు పేర్కొన్నారు. గతంలో తాను అదనపు డీజీపీగా పర్సనల్‌ విభాగంలో ఉన్నపుడు ఈ తరహా నిబంధనల ఆవశ్యకతపై చర్చించినట్లు తెలిపారు. అందుకనుగణంగానే కసరత్తు చేసి హ్యాండ్‌బుక్‌ను రూపొందించారని సర్వీస్‌ రూల్స్‌ రివిజన్‌ కమిటీ చైర్మన్‌ వై.గంగాధర్‌ను కమిటీ సభ్యులను డీజీపీ ప్రశంసించారు.

Updated Date - Apr 23 , 2026 | 04:47 AM