7,437 పోలీసు కొలువులకు వయో పరిమితి పెంపు
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:53 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల వయో పరిమితి రెండేళ్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు పోలీసు కొలువులకూ వర్తిస్తాయి.
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల వయో పరిమితి రెండేళ్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు పోలీసు కొలువులకూ వర్తిస్తాయి. పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్ని మాపక దళం, జైళ్లశాఖల్లో 7,437 ఉద్యోగాల భర్తీకి గత నెల 29న జారీ చేసిన నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లకూ ఈ వయో పరిమితి వర్తిస్తుందని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వోద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల వయో పరిమితి రెండేళ్లు పెంచుతూ 14న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ కానిస్టేబుళ్లు, సివిల్ ఎస్‌ఐలు, మెకానిక్, డ్రైవర్ కానిస్టేబుల్, ఫింగర్ ప్రింట్ బ్యూరో పోస్టులకు కూడా ఈ వయో పరిమితి వర్తిస్తుందన్నారు. ఈ పోస్టుల కోసం ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చునని, అందుకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీజీపీఆర్‌బీ) వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అవ్వాలని సూచించారు.