డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ ఫోర్స్ ప్రత్యేక గీతం
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:05 AM
మాదకద్రవ్యాల బారిన పడుతున్న యువతలో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణ పోలీసుల ‘ఈగల్ ఫోర్స్’ ఒక ప్రత్యేకమైన అవగాహన గీతాన్ని రూపొందించింది...
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల బారిన పడుతున్న యువతలో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణ పోలీసుల ‘ఈగల్ ఫోర్స్’ ఒక ప్రత్యేకమైన అవగాహన గీతాన్ని రూపొందించింది. ‘‘కలలను కాపాడుకుందాం.. డ్రగ్స్‌ను తరిమికొడదాం’’ అనే నినాదంతో రూపొందిన ఈ గీతం యువతకు ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది. ఈ గీతానికి సాహిత్యం, థీమ్, విజువల్స్, ఎడిటింగ్‌తోపాటు ఏఐ ఆధారిత సంగీతాన్ని అందించిన సునీత రాకేశ్‌ను డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో ఈ గీతాన్ని విస్తృతంగా వాడాలని ఈగల్ ఫోర్స్ నిర్ణయించింది.