Share News

డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల అభ్యర్థులకు 23 నుంచి డ్రైవింగ్‌ పరీక్షలు

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:43 AM

డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈనెల 23 నుంచి అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నామని పోలీ...

డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల అభ్యర్థులకు 23 నుంచి డ్రైవింగ్‌ పరీక్షలు

డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈనెల 23 నుంచి అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నామని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. మేడ్చల్‌లోని పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలు ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 28,903 మంది అభ్యర్ధులకు శారీరక కొలతల పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, డ్రైవింగ్‌ పరీక్షలు ఉంటాయని వివరించారు. శ్రామిక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 25,998 మంది అభ్యర్ధులకు వెయిటేజీ మార్కుల కేటాయింపు నిమిత్తం వారి ఽధ్రువపత్రాల పరిశీలన మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు అభ్యర్ధులు తమ అడ్మిట్‌ కార్డులను ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని సూచించారు. అభ్యర్ధులు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ ప్రతులను తప్పనిసరిగా తీసుకుని రావాలని పేర్కొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 05:43 AM