28న జాతీయ లోక్ అదాలత్‌కు ఏర్పాట్లు: డీజీపీ
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:06 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. మార్చి 14న జరగాల్సిన ఈ అదాలత్ 28కి రీషెడ్యూల్ అయిన నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను డీజీపీ సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్ కోషికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో రాజీపడదగ్గ కేసులను పరిష్కరించేందుకు పోలీసుల యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా భారీగా పెండింగ్‌లో ఉన్న పాత ట్రాఫిక్ చలాన్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందుకోసం ప్రతి పోలీస్ ేస్టషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రాసిక్యూషన్ అధికారుల సమన్వయంతో కక్షిదారులకు ముందస్తు అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు.