Share News

రేషన్‌ షాపుల్లో మొక్కజొన్న, జొన్నల పంపిణీ

ABN , Publish Date - May 07 , 2026 | 05:15 AM

రైతుల నుంచి సేకరించే మొక్కజొన్న, జొన్నలను రేషన్‌ షాపుల ద్వారా తక్కువ ధరకే ప్రజలకు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

రేషన్‌ షాపుల్లో మొక్కజొన్న, జొన్నల పంపిణీ

  • మంత్రివర్గ ఉప సంఘం భేటీలో చర్చ

హైదరాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి సేకరించే మొక్కజొన్న, జొన్నలను రేషన్‌ షాపుల ద్వారా తక్కువ ధరకే ప్రజలకు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో దీనిపై చర్చించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కార్యాలయం తెలిపింది. రైతుల నుంచి కొనుగోలు చేసే ఈ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో వేలం వేయడం వల్ల మధ్యవర్తులకు లాభం చేకూరుతోందని, దానికి బదులుగా పౌర సరఫరాల సంస్థ ద్వారా సామాన్య ప్రజలకే తక్కువ ధరకు అందించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. జొన్నలు, మొక్కజొన్నలను గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయాలని కూడా యోచిస్తున్నట్లు పేర్కొంది. మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకే పౌల్ర్టీ రైతులకు మొక్కజొన్నను సరఫరా చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.

Updated Date - May 07 , 2026 | 05:15 AM