Share News

బుల్లెట్‌ ట్రైన్‌కు అనంతగిరిలో స్టేషన్‌

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:18 AM

హైదరాబాద్‌ - పుణె బుల్లెట్‌ ట్రైన్‌ మార్గంలో అనంతగిరి దగ్గర ేస్టషన్‌ ఏర్పాటు చేయాలి. అనంతగిరి నుంచి ఐటీ హబ్‌కు రవాణా సౌకర్యం కల్పించాలి.

బుల్లెట్‌ ట్రైన్‌కు అనంతగిరిలో స్టేషన్‌

  • అక్కడి నుంచి ఐటీ హబ్‌కు రవాణా సౌకర్యం

  • బెంగళూరు బుల్లెట్‌ ట్రైన్‌కు ఫ్యూచర్‌ సిటీలోనూ

  • కాకతీయ వారసత్వం ఉట్టిపడేలా వరంగల్‌ ఎయిర్‌పోర్టు

  • ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌ - పుణె బుల్లెట్‌ ట్రైన్‌ మార్గంలో అనంతగిరి దగ్గర ేస్టషన్‌ ఏర్పాటు చేయాలి. అనంతగిరి నుంచి ఐటీ హబ్‌కు రవాణా సౌకర్యం కల్పించాలి. హైదరాబాద్‌ - బెంగళూరు హైస్పీడ్‌ రైల్వే లైన్‌కు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో స్టేషన్‌ ఏర్పాటు చేయాలి’’ అని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మంగళవారం ఆయన బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌, వరంగల్‌ ఎయిర్‌ పోర్టుపై సమీక్ష నిర్వహించారు. మన్ననూర్‌ దగ్గర నల్లమల స్టేషన్‌, సోమశిల సమీపంలో మరో స్టేషన్‌ ప్లాన్‌ చేయాలని సూచించారు. టూరిజం ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే లైన్‌ ఉండాలన్నారు. శంషాబాద్‌ను బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌గా పిలవాలన్నారు. వరంగల్‌ ఎయిర్‌ పోర్ట్‌ డిజైన్లపైనా సీఎం అధికారులతో చర్చించారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టులో కాకతీయ సామ్రాజ్యం, వారసత్వ సంపద అడుగడుగునా ఉట్టి పడేలా ఉండాలన్నారు. ఎయిర్‌ పోర్టు ముందు భారీ ఐలాండ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఐలాండ్‌లో రాణి రుద్రమ విగ్రహం, రుద్రదేవుడి విగ్రహాలతోపాటు భారీ నంది విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎయిర్‌ పోర్ట్‌ డిజైన్లపై ఢిల్లీ వెళ్లి ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో చర్చలు జరపాలని నిర్దేశించారు. సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస రాజు, టీజీఐఐసీ కమిషనర్‌ శశాంక్‌, రంగారెడ్డి కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ స్పెషల్‌ సెక్రటరీ ప్రావీణ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 04:18 AM