Share News

పారిజాతరెడ్డి దంపతుల వాంగ్మూలాల నమోదు

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:28 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బడంగ్‌పేట మాజీ మేయర్‌ పారిజాతరెడ్డి, ఆమె భర్త నర్సింహారెడ్డిల వాంగ్మూలాలను సిట్‌ అధికారులు బుధవారం నమోదు చేశారు.

పారిజాతరెడ్డి దంపతుల వాంగ్మూలాల నమోదు

  • ట్యాపింగ్‌ కేసు.. బీజేపీ నేత దీపక్‌రెడ్డికి సిట్‌ పిలుపు

హైదరాబాద్‌, సరూర్‌నగర్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బడంగ్‌పేట మాజీ మేయర్‌ పారిజాతరెడ్డి, ఆమె భర్త నర్సింహారెడ్డిల వాంగ్మూలాలను సిట్‌ అధికారులు బుధవారం నమోదు చేశారు. 2022లో వీరిద్దరి ఫోన్లను మావోయిస్టుల కోటాలో ట్యాపింగ్‌ చేశారని గుర్తించిన సిట్‌ అధికారులు వీరిని విచారణకు పిలిచారు. దంపతులైన తమ ఫోన్లను ట్యాపింగ్‌ చేయడం దారుణమని విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పారిజాతరెడ్డి అన్నారు. గత ఎన్నికల సమయంలో తమ ఫోన్లను ట్యాపింగ్‌ చేసి తమను ఇబ్బందులకు గురి చేశారని, గత ప్రభుత్వంలో ముఖ్యనేతగా ఉన్న ఓ మహిళ ఇందుకు కారణమని తాము అనుమానిస్తున్నామని ఆమె తెలిపారు. కాగా, ఈ నెల 4న విచారణకు హాజరు కావాలంటూ బీజేపీ నేత లంకల దీపక్‌ రెడ్డికి సిట్‌ నోటీసు ఇచ్చారు.

Updated Date - Jun 04 , 2026 | 06:28 AM