Share News

మీ ఫోన్‌ ట్యాప్‌ చేశారని సందేహం వచ్చిందా?

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:23 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాంగ్మూలాన్ని సిట్‌ అధికారులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసానికి వెళ్లిన సిట్‌ అధికారులు..

మీ ఫోన్‌ ట్యాప్‌ చేశారని సందేహం వచ్చిందా?

  • మంత్రి తుమ్మల వాంగ్మూలం నమోదు చేసిన సిట్‌

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాంగ్మూలాన్ని సిట్‌ అధికారులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసానికి వెళ్లిన సిట్‌ అధికారులు.. సుమారు 20 నిమిషాలపాటు విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. 2023 ఎన్నికల సమయంలో మీ ఫోన్‌ ట్యాప్‌ చేశారని ఎప్పుడైనా సందేహం వచ్చిందా? అని ఆరా తీశారు. తాను బయట ఏమి మాట్లాడతానో, ఫోన్‌లోనూ అవే విషయాలు మాట్లాడతానని, పెద్దగా రహస్యాలు ఉండవని విచారణ అధికారులకు మంత్రి తుమ్మల వెల్లడించినట్లు తెలిసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరికొంత మంది రాజకీయ ప్రముఖులకు సిట్‌ నోటీసులు జారీ చేసింది.

Updated Date - Jun 14 , 2026 | 04:23 AM