Share News

రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:03 AM

రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2024-25లో రాష్ట్ర తలసరి ఆదాయం 3,80,031 ఉండ గా.. 2025-26లో అది 4,18,931కు పెరిగింది.

రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931

  • ఇది దేశ తలసరి ఆదాయం కంటే రెట్టింపు

  • ఈ ఏడాది జీఎస్‌డీపీ వృద్ధిరేటు 10.7 శాతం

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2024-25లో రాష్ట్ర తలసరి ఆదాయం 3,80,031 ఉండ గా.. 2025-26లో అది 4,18,931కు పెరిగింది. 2024-25లో 9.8 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, 2025-26లో 10.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. దేశ తలసరి ఆదాయం 2024-25లో రూ.2,05,324 ఉండగా.. 2025-26లో 2,19,575గా ఉంది. 2024-25లో దేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు 8.7 శాతం ఉండగా.. ఈ ఏడాది 6.9 శాతంకే పరిమితమైంది. 2025-26లో దేశ తలసరి ఆదాయం (రూ.2,19,575)కంటే తెలంగాణ తలసరి ఆదాయం (రూ.4,18, 931) దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ఇక, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ) సైతం భారీగా పెరిగింది. ప్రస్తుత ధరల వద్ద జీఎస్‌డీపీ రూ.17,82,198 కోట్ల మేర నమోదవగా.. 2024-25లో ఇది 16,09,902 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ వృద్ధి రేటు 10.7 శాతంగా నమోదైంది. 2024-25లో దేశ జీడీపీ వృద్ధి రేటు 9.8 శాతం కాగా.. 2025-26లో అది 8 శాతానికే పరిమితమైంది. అలాగే, 2024-25లో దేశ జీడీపీలో తెలంగాణవాటా 4.97 శాతం ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.99శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది.

Updated Date - Mar 21 , 2026 | 05:03 AM