Share News

రేపు ప్రభుత్వ పింఛనుదారుల మహాధర్నా

ABN , Publish Date - Aug 06 , 2026 | 06:25 AM

రాష్ట్ర ప్రభుత్వం పింఛనుదారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందున ఆగస్టు 7వ తేదీ మహాధర్నాకు పిలుపు ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ పింఛనుదారుల ఐకాస బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

రేపు ప్రభుత్వ పింఛనుదారుల మహాధర్నా

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం పింఛనుదారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందున ఆగస్టు 7వ తేదీ మహాధర్నాకు పిలుపు ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ పింఛనుదారుల ఐకాస బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు నెలల్లో ఆరోగ్య కార్డులు, నగదు రహిత వైద్యం, ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, 15 రోజుల్లో కరువు భత్యం వాయిదాల మంజూరు, బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి అన్నీ అటకెక్కించిన ప్రభుత్వం.. శుష్క వాగ్దానాలతో పింఛనుదారులను మభ్యపెడుతోందని తెలంగాణ ప్రభుత్వ పింఛనుదారుల ఐకాస చైర్మన్‌ కె. లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ తెలిపారు. అన్ని జిల్లాల నుంచి పింఛనుదారులు తరలి వచ్చి మహాధర్నాలో పాల్గొనాలని కోరారు.

Updated Date - Aug 06 , 2026 | 06:27 AM