Share News

హమ్మయ్యా పంచాయతీలకు నిధులొచ్చాయ్‌!

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:59 AM

నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం ఊపిరినిచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిల కింద గురువారం తొలి విడతగా...

హమ్మయ్యా పంచాయతీలకు నిధులొచ్చాయ్‌!

  • తొలి విడతగా రూ.259.36 కోట్లు.. మంత్రి సీతక్క హర్షం

హైదరాబాద్‌, పిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం ఊపిరినిచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిల కింద గురువారం తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు చేపట్టడంలో జాప్యం వల్ల 2024--25, 2025--26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3000కోట్ల మేర నిలిచిపోయాయి. రెండు నెలల కిందట ఎన్నికలు జరిగి, సర్పంచులు కొలువుదీరడంతో బకాయి నిధులను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ.. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసింది. మొత్తం బకాయిలను మార్చి 31వ తేదీ లోపు విడతల వారీగా విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ, కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు రూపొందించినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ తొలి విడతగా రూ.259.36 కోట్లను విడుదల చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 06 , 2026 | 03:59 AM