ధాన్యం దిగుబడి జాస్తి..బియ్యం సేకరణ నాస్తి!
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:54 AM
వానా కాలం, యాసంగి అనే తేడా లేకుండా వరి పంట రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది.2 సీజన్లలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తోంది...
ఏటికేడు సీఎంఆర్ కోటా తగ్గిస్తున్న కేంద్రం.. ఐదేళ్ల నుంచి తగ్గుతున్న ఎఫ్‌సీఐ బియ్యం కోటా
2020-21లో 61.48 లక్షల టన్నుల సీఎంఆర్
2024-25 లో 44.68 లక్షల టన్నులు మాత్రమే
కోటా పెంపునకు ప్రతిసారి ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు
హైదరాబాద్, ఏప్రిల్10 (ఆంధ్రజ్యోతి): వానా కాలం, యాసంగి అనే తేడా లేకుండా వరి పంట రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది.2 సీజన్లలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి వడ్లు కొనుగోలు చేస్తోంది. అయితే వాటిని బియ్యంగా మార్చేసి కేంద్రానికి అప్పగించడ మే గగనమవ ుతోంది. ఫలితంగా ఏటేటా వరి ధాన్యం దిగుబడి పెరుగుతుండగా.. దానికి తగినట్లుగా భార త ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) టార్గెట్ ఇవ్వటంలేదు. ఏడాదికేడాది కోటా తగ్గిస్తూ వస్తోంది. ఆరేళ్ల క్రితం 62 లక్షల మె ట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్న కేంద్రం... ఈసారి 45లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్నే తీసు కుంది బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) కోటానైతే గణనీయంగా తగ్గిస్తోంది. 2019-20లో 92.50ు ఉప్పుడు బియ్యం తీసుకుంటే, 2024-25లో 66.78 శాతమే తీసుకుంది. రాష్ట్రంలో ఒకవైపు ధాన్యం దిగు బడి, రైతుల నుంచి కొనుగోళ్లు భారీగా పెరుగు తుంటే.. మరోవైపు కేంద్రం ఏటేటా కోటా తగ్గిస్తూ పోతోంది. కేంద్రం అమలుచేస్తున్న డీ-సెంట్రలైజ్‌డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్(డీసీపీ) పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామిగా ఉంది. కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలుచేసి.. కేంద్రానికి బియ్యం అప్పగించటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కానీ కేంద్ర ప్రభుత్వం కోటా తగ్గిస్తుండటం.. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లు, బియ్యం నిల్వలు విపరీ తంగా పెరుగుతుండటంతో అసమతుల్యత ఏర్పడు తోంది. కాగా ప్రస్తుతం సాధారణ వడ్ల రకమైతే రూ. 2,369, ఏ- గ్రేడు ధాన్యమైతే రూ. 2,389 ఉంది. ఎమ్మెస్పీ చెల్లిస్తూనే రాష్ట్రప్రభుత్వం సన్నాలకు బోనస్ పథకాన్ని అమలుచేస్తోంది. క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో సన్నధాన్యం రేటు రూ. 2,889కు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొను గోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తుండటంతో రైతులు వరి సాగును విపరీతంగా పెంచారు. ఈ ఏడాది(2025-26)లో ఖరీఫ్‌లో 67,30,408 ఎకరాల్లో, యాసంగిలో 61,11,121 ఎకరాల్లో కలిపి మొత్తం 1,28,41,529 ఎకరాల(1.28కోట్ల పైచిలుకు) విస్తీర్ణం లో రైతులు వరి సాగుచేశారు. అంటే ఏడాదిలో సుమారు 3.60 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్ప త్తి అవుతోంది.
దీనిని రైస్‌మిల్లర్లకు అప్పగించి మి ల్లింగ్ చేయించటం, బియ్యం తీసుకోవటం, ఎఫ్‌సీఐకి అప్పగించటం ప్రహసనంగా మారింది. అధిక నిల్వ లు, గోదాముల నిర్వహణ, మిల్లింగ్ వ్యయం, వడ్డీ భారం తడిసి మోపెడవుతోంది. ఎఫ్‌సీఐ కోటా కేటా యింపుల కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిసారి కేంద్రానికి విజ్ఞప్తులు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి ముఖ్య మంత్రి కూడా ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై ప్రధాని, కేంద్ర మంత్రులను కలవాల్సి వస్తోంది. ఇకరాష్ట్ర వ్యవసా య, పౌరసరఫరాల శాఖల మంత్రులు లేఖ లు రాయటం, ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తు లు చేయటం, కృషిభవన్ అధికారులను కూడా కలవటం పరిపాటిగా మారింది. ఒకరకంగా బియ్యం కోటా కేటాయింపులకోసం కేంధ్రాన్ని బతిమాలుకోవాల్సి వస్తోంది. ప్రతియేటా ఇదేతంతు జరుగుతోంది. ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించడం అనే ప్రక్రియ అత్యంత క్లిష్టతరంగా మారింది. ఒకవైపు ధాన్యం దిగుబడి, ఉత్పత్తి పెరుగుతుంటే.. మరోవైపు కోటాలో కోతలు పెట్టడంతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రత్యామ్నాయ పంటలు అనివార్యమా?
రాష్ట్రంలో పప్పు ధాన్యాలు, నూనెగింజలు, కూర గాయలు, చిరు ధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. వీటిని ఇతర రాష్ట్రాలు, వి దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. వరి మినహా ఇతర ఆహార ధాన్యాలు రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా ఉత్పత్తి కావటంలేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగాల్సి ఉంది. చిరుధాన్యాలు, నూనెగింజలు, పప్పు ధాన్యాలకు మార్కెట్ భద్రత కల్పించటం అనేది ప్రధా న అంశంగా మారింది. సన్నా లకు క్వింటాకు రూ.500 ఇచ్చిన ట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలకు బోనస్ ప్రకటించ టంతోపాటు వరి ధాన్యం తరహాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోలు చేస్తేనే రైతులు పంటల మార్పిడి కోసం ముందుకొచ్చే అవకాశాలున్నాయి.
ఎకరానికి 50 బస్తాల దిగుబడి
ఆరేళ్లుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఈసారి రెండెకరాల్లో వరి సాగుచేశా. యాసంగి అయినప్పటికీ సన్నరకం సాగుచేశాను. ఎకరానికి 50 బస్తాల (35 క్వింటాళ్ల) దిగుబడి వచ్చింది.
- ఒడ్డె సాయిలు, కౌలు రైతు, నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంబం గ్రామం
ఎకరానికి 58 బస్తాల దిగుబడి
ఈ యాసంగి సీజన్‌లో 8 ఎకరాల్లో వరి సాగుచేశారు. మొత్తం సన్నరకాలే సాగుచేశాను ఎకరానికి 58 బస్తాల చొప్పున (40 క్వింటాళ్ల) ధాన్యం దిగుబడి వచ్చింది.
- ఆడప సాయిలు, రుద్రూరు, నిజామాబాద్ జిల్లా