Share News

ధాన్యం కుప్పలపైనే రైతులు కుప్పకూలుతున్నారు: కేటీఆర్‌

ABN , Publish Date - May 24 , 2026 | 04:42 AM

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆల స్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు కేంద్రాల వద్దే కొందరు రైతులు ప్రాణాలు...

ధాన్యం కుప్పలపైనే రైతులు కుప్పకూలుతున్నారు: కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆల స్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు కేంద్రాల వద్దే కొందరు రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. ఎండ తీవ్రతకు తోడు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచి ఉండడం వల్ల రైతులు గుండెపోటుతో ధాన్యం కుప్పల మీదే కుప్పకూలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని, వ్యవస్థలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. పంటను త్వరగా కొనుగోలు చేయకుండా రైతులను ఇంకెంత కాలం ఇబ్బంది పెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి, తక్షణమే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి రైతుల తిప్పలు తీర్చాలని శనివారం ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - May 24 , 2026 | 04:42 AM