నేటి నుంచి కొనుగోలు కేంద్రాల సందర్శన
ABN , Publish Date - May 03 , 2026 | 04:23 AM
రాష్ట్ర ప్రభుత్వం వరి, మొక్కజొన్న, ఇతర పంటల కొనుగోలులో విఫలమైందని, కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం...
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, మే2 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వరి, మొక్కజొన్న, ఇతర పంటల కొనుగోలులో విఫలమైందని, కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ కమిటీల ద్వారా పంట కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల పనితీరును తెలుసుకునేందుకు సీపీఎం బృందాలు ఆదివారం రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తాయని ఆయన చెప్పారు. ఈ నెల 11న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గన్నీ బ్యాగుల కొరతతో రైతులు బస్తాకు రూ.30 అదనంగా చెల్లించాల్సి వస్తోందని, దళారులు తరుగు పేరుతో క్వింటా వరి బస్తాలో 5 కిలోల కోత విధిస్తున్నారని వెస్లీ చెప్పారు.