Share News

యాసంగి ముడి బియ్యంపై టెస్ట్‌ మిల్లింగ్‌

ABN , Publish Date - Apr 24 , 2026 | 03:56 AM

రాష్ట్రంలో యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి ముడి బియ్యం(రా రైస్‌) ఉత్పత్తిపై నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం..

యాసంగి ముడి బియ్యంపై టెస్ట్‌ మిల్లింగ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి ముడి బియ్యం(రా రైస్‌) ఉత్పత్తిపై నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యం నుంచి ముడి బియ్యం ఎంత ఉత్పత్తి అవుతుందో తేల్చేందుకుగాను టెస్ట్‌ మిల్లింగ్‌ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ(సీఎ్‌ఫటీఆర్‌ఐ) ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన సీఎ్‌ఫటీఆర్‌ఐకి లేఖ రాశారు.

Updated Date - Apr 24 , 2026 | 03:56 AM